Dear Santhosh, "Knowledge makes you great". My blessings and greetings to Sulakshya Seva Samithi.
"Bharat Ratna" Dr APJ Abdul Kalam, Former President of India.
Date: 13.05.2015
సంతోష్ గారు , ఒక గొప్ప సమాజ నిర్మాణానికి మీరు చేస్తున్న కృషి అమోఘం . మీరు చేపట్టే కార్యక్రమాల ద్వారా ఉన్నత స్థితికి , ఉన్నత స్థాయి కి చేరారు . మీ కార్యక్రమాలను మరింత విస్తృత పరచండి . భారత దేశాన్ని ఒక మధురమైన అమృత బాండంగా అందరం కలిసి చేద్దాం . అభినందనలతో .. శుభాసిస్సులతో ..
శ్రీ వి . వి . లక్ష్మీనారాయణ ,ఐ. పి .ఎస్, అదనపు డి.జి .పి (మహారాష్ట్ర ), సీబీఐ పూర్వ జెడి
తేదీ: 13 .08 .2017
పరోపకారం ఇదం శరీరం ! ఇంత చిన్న వయస్సులో సమాజ అభ్యున్నతికై పరితపించి , ఒక మహోన్నత లక్ష్యంతో నిస్వార్ధంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న సులక్ష్య సేవా సమితిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను . ఈ యువ బృందానికి మరెందరి జీవితాల్లోనో వెలుగులు నింపే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను . ఆశీస్సులతో ...
"పద్మశ్రీ ", "కళాతపస్వి " కె. విశ్వనాధ్, ప్రముఖ సినీ దర్శకులు , దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
తేదీ : 28 .02 .2017
సులక్ష్యం, సేవ, సమితి అనే మూడు పదాలు గొప్పవి. లక్ష్యం మంచిది కావాలె, సేవాభావం అవసరం, సమితి అంటే అందరూ కలిసి ఉండాలని అర్థం . బడి అవసరాలు తీర్చాలనే సులక్ష్యంతో సేవ చేస్తున్న ఈ సమితిని, సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మండువ సంతోష్ కు నా అభినందనలు
శ్రీ మాడభూషి శ్రీధర్ , కేంద్ర సమాచార కమీషనర్, న్యూ డిల్లీ.
తేదీ: 26.07.2014
ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు మరియు మీలాంటి స్వచ్చంధ సంస్థల ద్వారా అభివృద్ధి చెందబడతాయి . గతంలో పలుమార్లు మీరు చేపట్టిన సేవా కార్యక్రమాలకు విచ్చెయ్యడం జరిగింది . ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్న సులక్ష్య సేవా సమితికి నా హృదయపూర్వక అభినందనలు , ఆశిస్సులు.
డా . చుక్కా రామయ్య , ప్రముఖ విద్యావేత్త
తేదీ: 04.08.2016
పిల్లలకు చిన్నతనం నుంచే మొక్కలు నాటాలనే తలంపుతో మా దంపతులను ఖమ్మం నుంచి ఇక్కడికి పిలిపించి , మా చేత మొక్కలు నాటించి , ఘనంగా సన్మానించినందుకు సులక్ష్య సేవా సమితికి కృతజ్ఞతలు.. రాయి ఏదో, రత్నం ఏదో గుర్తించగలిగే పరిజ్ఞానం ఈ సమితికి బహు మెండుగా ఉందనేది నా భావన. నేను , నా అని ఆలోచించే ఈ రోజుల్లో సమాజం కోసం ఎంతో కొంత చెయ్యాలని తలచి సమాజ సేవ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సులక్ష్య సేవా సమితి వారికీ , ప్రత్యేకించి మండువ సంతోష్ గారికి నా ప్రకృతి మాత ప్రణామాలు. సదా మీ సేవలో ..
"పద్మశ్రీ " , "వనజీవి " దరిపల్లి రామయ్య
తేదీ: 13 .08 .2017
Very good and inspiring work. Keep it up. I wholeheartedly appreciate you personally and on behalf of the government for the exemplary work you are doing for the benefit of the needy. Congratulations to Sulakshya Seva Samithi headed by Santhosh. All the best.
Smt. Vakati Karuna, IAS, Former District Collector, Warangal, Director of Public Health & Family Welfare, Government of Telangana.
Date: 14.07.2016
సమాజంలో మానవీయ విలువలు పెంపొందించాలనే మహత్తర సంకల్పంతో సులక్ష్య సేవా సమితి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అపూర్వమైనవి, ఉన్నతమైనవి మరియు స్ఫూర్తిదాయకమైనవి . శుభం భూయాత్ .
తనికెళ్ళ భరణి, ప్రముఖ సినీ నటుడు , రచయిత , దర్శకుడు
తేదీ : 03 .07 . 2017
సులక్ష్య సేవ సమితి చేసిన కార్యక్రమాలు చూచి ఆనందమయింది. ప్రారంభించిన ఆనతి కాలంలోనే అన్ని రంగాలలో వినూత్నంగా సేవా కార్యక్రమాలు చేసిన ఈ సంస్థ అభినందనీయం. అధ్యక్షలు, సభ్యులు ఎంతో ఉత్సాహంతో , దీక్షతో చేస్తున్నారు. ఇంకా ఎన్నో సేవలు చేసే శక్తి భగవంతుడు వీరికి ఇవ్వాలని మనసారా కోరుతూ ఆశిర్వదిస్తున్నాను.
ధ్వని అనుకరణ సామ్రాట్, కళా ప్రపూర్ణ, "పద్మ శ్రీ" డా. నేరెళ్ళ వేణుమాధవ్
తేదీ : 26.10.2014
Initiatives like those coming from Sulakshya Seva Samithi (SSS) are not only laudable for their spirit and ethos but also for the social positive externality they engender. Our country needs many more such youngsters to come together on fora such as these and contribute towards social, economical and moral upliftment.
Sri Karthikeya Mishra, IAS, Former CMD, APNPDCL
Date: 11.04.2013
Sulakshya Seva Samithi is doing a commendable job for the well-being of society. I wish them all the best in all their future endeavours.
Amrapali Kata, IAS, Dy. Secretary, PMO, New Delhi, Former District Collector, Warangal (Urban)
Date: 25.07.2017
Great work Santhosh. Please keep it up. You are an asset to this society & country. Let your tribe increase in this world. All the best.
V.C.Sajjanar, IPS, VC & MD, TSRTC
Date: 02.01.2023
జ్ఞానం సృష్టి సమస్య పూరణమ్ ధాన్యం మూల రహస్య ప్రేరణం జ్ఞానాన్ని పిల్లలకు అందిస్తూ ఎంతో మంది యువ నాయకులను ప్రేరేపిస్తున్న " సులక్ష్య సేవా సమితి" సంతోష్ కు నా హృదయపూర్వక అభినందనలు
ప్రొఫెసర్ నిశాంత్ దొంగరి, IIT హైదరాబాద్ ఆచార్యులు, ప్రముఖ శాస్త్రవేత్త
Date: 14.07.2016
Very grateful for the service Sulakshya Seva Samithi is rendering to the needy & vulnerable. More power to their tribe. God bless & Godspeed.
Smt. Pamela Satpathy, Former Municipal Commissioner, GWMC
Date: 02.06.2020